గీతాచరణం గురించి

భగవద్గీత, భగవంతుడైన శ్రీకృష్ణుడు మరియు యోధుడు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణ. భౌతిక ప్రపంచం యొక్క అన్ని ధ్రువాల నుండి అంతిమ స్వేచ్ఛ అయిన మోక్షాన్ని పొందేందుకు మానవాళికి భగవంతుని మార్గదర్శకమే భగవద్గీత. మన మన స్వభావంలకు అనుగుణంగా అనుసరించగల అనేక మార్గాలను భగవానుడు భగవద్గీతలో చూపుతాడు.

 

భగవద్గీతను ప్రస్తుత కాల సందర్భాలను, ఉదాహరణలను ఉపయోగించి అర్థం చేసుకునే విధంగా ప్రస్తుతింపబడింది . శివ ప్రసాద్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. 25 సంవత్సరాలకు పైగా ప్రజా జీవితం ద్వారా కలిగిన అనుభవం; స్వంత జీవితాన్ని, ఇతరుల జీవితాలను గమనించడం ద్వారా కలిగిన అవగాహన ద్వారా భగవద్గీతను అందించడానికి చేసిన ప్రయత్నమే ఈ వెబ్‌సైట్.

 

తాజా ఎపిసోడ్

6. శాసన నియమాలు | ఆగస్టు 02, 2022

श्భగవద్గీత ఆంతరంగిక ప్రపంచంలో సమత్వాన్ని , సద్భావనను నిలబెట్టుకోవడం కోసమైతే , చట్టం బయటి ప్రపంచంలో క్రమానుగత వ్యవస్థను నిలబెట్టడం కోసం. ఏ కర్మకైనా రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఉద్దేశం , రెండోది అమలు చేయడం. చట్టం ఆధారిత ప్రపంచంలో , నేరపరిభాషలో లాటిన్ పదాలను ఉపయోగించి వీటిని ' మెన్స్ రియా అండ్ ఆక్టస్ రియస్ ' అని అంటారు.

చదవండి

ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది

గీతాచరణం

ఓ సాధకుని దృష్టిలో

ఈ పుస్తకం భగవద్గీతపై వారంవారీ వ్యాసాల సంకలనం. ప్రతి కథనం గీతలోని వివిధ అంశాల వివరణను కలిగి ఉంటుంది. భగవద్గీతను అర్ధం చేసుకొనడానికి, సాధకుడు ఏదైనా వ్యాసాన్ని ఎంచుకుని ఆనందాన్ని పొందవచ్చు.


Buy Now నమూనా పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేయండి


తెలుగులో తాజా ఎపిసోడ్లు

6. శాసన నియమాలు

భగవద్గీత ఆంతరంగిక ప్రపంచంలో సమత్వాన్ని , సద్భావనను నిలబెట్టుకోవడం కోసమైతే , చట్టం బయటి ప్రపంచంలో క్రమానుగత వ్యవస్థను నిలబెట్టడం కోసం. ఏ కర్మకైనా రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఉద్దేశం , రెండోది అమలు చేయడం. చట్టం ఆధారిత ప్రపంచంలో , నేరపరిభాషలో లాటిన్ పదాలను ఉపయోగించి వీటిని ' మెన్స్ రియా అండ్ ఆక్టస్ రియస్ ' అని అంటారు.

5. జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు

వారి వారి దృష్టికోణాలను బట్టి భగవద్గీత అనేక మందికి అనేక విధాలుగా దర్శనమిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది. కర్మయోగము , సాంఖ్య యోగము , భక్తి యోగము. కర్మయోగం మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగం బుద్ధిపై , భక్తియోగం హృదయం పై , ఆధారపడే వారికి అనుకూలమైనవి.

4. మనస్సు ఆడించే ఆటలు

మన లోపలి వెలుపలి ప్రపంచాలకు ఇంద్రియాలు ద్వారాల వంటివి. అందుకే భగవద్గీత వాటిని అర్థం చేసుకోమని నొక్కి చెబుతుంది. “ ఒకటిగా పనిచేసే నాడీకణాలు (న్యూరాన్లు) ఒక్కటిగానే ముడిపడి ఉంటాయని ” నాడీ శాస్త్రం ప్రతిపాదిస్తుంది. దీనినే హార్డ్ వైరింగ్ అంటారు. భగవద్గీతలోని వాక్యాలు కూడా , ఆ కాలాన్ని బట్టి ఉపయోగించే భాషలో ఇదే సందేశాన్ని ఇస్తాయి.

3. వర్తమానానిదే ప్రాధాన్యత

మనమేమిటో భగవద్గీత చెబుతుంది. ఇది సత్యాన్ని గురించి తెలిసుకొనటమే కాకుండా, సత్యవంతులై ఉండటం వంటిది. మనం వర్తమానంలో జీవించినప్పుడే ఇది సాధ్యమౌతుంది.

2.జీవితంలోని వైరుధ్యాలు

“అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరతాయి” అన్నట్లుగా భగవద్గీతలో ఇవ్వబడిన అన్ని మార్గాలు మనల్ని ఆత్మజ్ఞానం వైపుకి నడిపిస్తాయి. కొన్ని దారులు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఇదంతా ఒక వలయం లాంటిది. ఏ దారిలో ప్రయాణించినా కూడా ఒకే గమ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాయి.

1. అహంకారం తో ఆరంభం

శ్రీకృష్ణ భగవానుడికి, యోధుడైన అర్జునుడికి కురుక్షేత్రమనే యుద్ధ క్షేత్రంలో జరిగిన 700 శ్లోకాల సంభాషణే 'భగవద్గీత.'


అన్ని అధ్యాయాలు

संपर्क करें

Loading
Your message has been sent. Thank you!