వారి వారి దృష్టికోణాలను బట్టి భగవద్గీత అనేక మందికి అనేక విధాలుగా దర్శనమిస్తుంది. ఆత్మజ్ఞానము పొందడానికి భగవద్గీత మూడు మార్గాలను ఉపదేశిస్తుంది. కర్మయోగముసాంఖ్య యోగముభక్తి యోగము. కర్మయోగం మనస్సు ఆధారితమైన వారికి అనువైనది. సాంఖ్యయోగం బుద్ధిపైభక్తియోగం హృదయం పైఆధారపడే వారికి అనుకూలమైనవి.

            ఈనాటి ప్రపంచంలో అత్యధిక శాతం మనస్సు మీద ఆధారపడే వర్గానికి చెందుతారు. మనమేవో సంకెళ్ళతో కట్టబడ్డామనీవాటిని తెంచుకునేందుకు చాలా కష్టపడి పని చేయాలన్న నమ్మకంపై ఆధారపడి ఇది పనుల దిశగా ప్రేరేపిస్తుంది. వీరితో ఏ విధమైన సంభాషణైనా 'ఇప్పుడు నేను ఏమి చేయాలిఅన్న అంశంతో ముగుస్తుంది. ఈ దారి మనను నిష్కామకర్మఅంటే కోరికలు లేనిఫలితము ఆశించని కర్మల వైపు నడిపిస్తుంది.

            సాంఖ్య యోగాన్ని జ్ఞాన యోగం అని కూడా అంటారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం సాధారణంగా ఉపయోగించే విజ్ఞానం కాదుఇది కేవలం అవగాహన లేదా తెలుసుకోగలిగే సామర్థ్యం గురించి మాత్రమే. మనమేదో చీకటిగదిలో ఉన్నామనిఏమి చేసినా కూడా ఈ అంధకారం పోదు గనక దాన్ని పారద్రోలడానికి ఒక దీపాన్ని వెలిగించాలన్న నమ్మకమే దాని ఆరంభ బిందువు. ఈ మార్గం మనకు కోరిక లేదా ఎంపిక లేని అవగాహన యొక్క అనుభూతిని ఇస్తుంది.

            భక్తి యోగం శరణాగతికి సంబంధించినది. సముద్రంలోని అలతో వారు తమను పోల్చుకుంటారు. ఇక్కడ సర్వోత్కృష్టులైన పరమాత్మే సముద్రం.

            మొట్టమొదట్లో ఈ మూడు మార్గాల యొక్క భాషఅవగాహన చాలా విభిన్నంగా ఉంటుంది. అవగాహన ను గురించిన మార్గాన్ని మనస్సు ఆధారిత వ్యక్తికి చెప్పినట్లయితేఅతడు అవగాహనను పొందడానికి ఏదైనా పని చెయ్యాలని వెతుకుతూ ఉంటాడు.

            నిశ్చయంగా ఈ మూడు మార్గాలూ ఒకదానికొకటి భిన్నమైనవి కావు. జీవితములో మనము ఈ మూడు మార్గాల యొక్క కలయికనే అనుభూతి చెందుతాము. ఉదాహరణకు కర్మసాంఖ్య మార్గాలు కలిసినప్పుడు అన్ని కర్మల యొక్క అంతిమ గమ్యం ఎండమావేనని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కర్మకు అంటకుండా నాటకంలో పాత్రధారులు లాగా కర్మలను కొనసాగిస్తాము.

            ఎలాగైతే 'ఎలక్ట్రాన్,' 'ప్రోటాన్', 'న్యూట్రాన్అనే మూడు పరమాణువుల సమ్మేళనం వలన ఈ విశ్వము నిర్మింపబడునో అలాగేఆధ్యాత్మిక ప్రపంచం ఈ మూడు దారుల యొక్క సమ్మేళనము.

            ఈ మూడు మార్గాలూ కూడా అహంకార విముక్తమైన అంతరాత్మ అనే ఒకే గమ్యానికి చేరుస్తాయని శ్రీకృష్ణుడంటారు.


English - Read

 

< Previous Chapter | Next Chapter >