అన్ని మార్గాలు ఒకే గమ్యానికి చేరతాయి” అన్నట్లుగా భగవద్గీతలో ఇవ్వబడిన అన్ని మార్గాలు మనల్ని ఆత్మజ్ఞానం వైపుకి నడిపిస్తాయి. కొన్ని దారులు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. కానీ ఇదంతా ఒక వలయం లాంటిది. ఏ దారిలో ప్రయాణించినా కూడా ఒకే గమ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాయి.

గీతోపదేశము వివిధ స్థాయిల్లో ఉన్నదన్న విషయాన్ని మన మెల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు అర్జునుడి స్థాయికి వచ్చి బోధిస్తారు. కొన్నిసార్లు ఆయన పరమాత్మగా ప్రకటితమవుతారు. ప్రాథమిక దశలో ఈ రెండు స్థాయిలూ వేరువేరుగా కనిపిస్తాయి కనుక ఆకళింపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

గత శతాబ్దం మొదట్లో కాంతిని అర్థం చేసుకునేటప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొదట కాంతికి తరంగ స్వభావం ఉందని నిరూపించారు. తర్వాత అది కణంలా ప్రవర్తిస్తుందని గుర్తించబడింది. ఈ రెండు సిద్ధాంతాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ మనం ప్రతి క్షణం చూసే కాంతి స్పష్టమైన వైరుధ్యాల కలయిక. అలాంటిదే జీవితం కూడా!

ఒకసారి ఒక ఏనుగు ఒక గ్రామంలో ప్రవేశించిందట! కొంత మంది అంధులు దాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసారు. వారు ఏనుగును తాకిన భాగాన్ని బట్టిఆ ఏనుగు ఎలా ఉంటుందో ఊహించుకున్నారు. తొండాన్ని తాకిన వారు ఏనుగు పొడవైనగరుగ్గా ఉన్న ప్రాణి అన్నాడు. ఏనుగు దంతాన్ని తాకినవాడుఆ జంతువు రాతి లాగా గట్టిదన్నాడు. పొట్ట భాగాన్ని తాకినవాడు అది పెద్దగామెత్తగా ఉందన్నాడు. ఈ విధంగా వారి ఊహలు కొనసాగాయి.

నేడు ప్రపంచంలో మనం చూస్తున్న భిన్నాభిప్రాయాలువిబేధాలన్నిటికీ కారణం ఒకే వాస్తవాన్ని అనేక దృక్పథాలతో చూడడం. నిజానికి ఇవేవీ ఏనుగును సమగ్రంగా వర్ణింపలేవు ఎందుకంటే ఇవన్నీ కలిపితేనే అసలైన ఏనుగు.

మన మానసిక స్థితి కూడా వ్యక్తులువస్తువులుసంబంధాల పరంగా చూస్తే ఈ అంధుల కంటే భిన్నంగా ఏమీ లేదు. ఈ పాక్షిక అవగాహనే మనం ఎదుర్కునే అనేక సమస్యలకు మూలకారణం. పాక్షిక అవగాహన నుండి పరిపూర్ణ అవగాహన దిశగా సాగే ప్రయాణమే గీతాచరణం.

భగవద్గీతను ఆచరించటానికి మనం ఏ కొన్ని అడుగులు ముందుకేసినాఏ చిన్న ప్రయత్నాలు చేసినా ఆ మేరకు మన జీవితాలు సంతోషమయం అవుతాయనటంలో సందేహమే లేదు.


English - Read